త్రివిక్రమ్ గురించి 4 ముక్కల్లో చెప్పాలంటే..!

ఆయనంటే ఆరాధనతో కూడిన ఇష్టం వల్ల వచ్చిన గౌరవం..
ఆయన మాటలు వింటే.. బతుకు మీద భరోసా వస్తుంది..
ఫ్యూచర్ మీద ఆశ కలుగుతుంది.. ఒంట్లో కన్ఫిడెన్స్ పెరుగుతుంది..
..
ఎవరైన మాటలు శ్రద్దగా రాస్తారు.. ఆకట్టుకునేలా వాడుతారు..
కానీ ఆయన పెన్నుతో పదాలు కట్టినట్లు.. గులాబీ మొక్కలు అంటుకట్టినట్లు..
పద్దతిగా.. చాలా కొత్తగా..పంచెస్ రాస్తాడు..

మాటలు కూడా సినిమాకు వెళ్లేలా చేస్తాయని…అది మళ్లీ, మళ్లీ మాటలు వినేందుకే వెళ్లేలా చేస్తాయని..’అతడు’ని చూస్తే తెలిసింది.. బొక్కలు విరిచి..మొక్కలకు వేస్తా.. అంటే ఎరువు లేకపోతే..అరువు తెచ్చుకుందాం కానీ.. వాడితో పెట్టుకోకు పరువు పోతుంది.. ఇలా..ఒక్కో డైలాగ్ లో మూడు ప్రాస పదాలు పేర్చి.. తెలుగు సినిమా చరిత్రలో తన దైన స్టైల్ క్రియేట్ చేశాడు..

అర్జంటా.. ఇంపార్టెంట్ ఆ అంటే సీరియస్..
కుదిరితే క్షమించు..లేదంటే శిక్షించు..మేమున్నామని గుర్తించు
ఇలా ఆయన మాటలు ..మూడు అంచెలుగా ఉంటాయి..
..
అతడు చూశాకా..ఎవరితను అనిపించాడు.. వెనక్కి వెళ్లి ఆయనను నువ్వే..నువ్వే ..నువ్వేకావాలి..నువ్వునాకు నచ్చావ్.. అనేలా చేశాడు..
ఏం వచ్చు అంటే.. ఈతొచ్చు అని ఒక్కలైన్ తో..ఆయన టైమింగ్ ఏంటో చూపిస్తాడు..

ఇలా ఆయన గురించి చెబుతూ ఉంటే.. పేజీలు సరిపోవు..ఫేస్ బుక్ మొత్తం కావాలి..

..ఆయన ఎప్పుడో 10ఏళ్ల క్రితం వేసిన పంచులే మనం..ఏరుకొని..జబర్ దస్త్ అనుకుంటున్నాం..
ఆయన పంచులు..ప్రసాలే కాదు.. జీవితంలో చెప్పే సత్యాలన్నీ..సింపుల్ గా ఎక్కిస్తాడు..
ఈ ఏజ్ లో నాకు కావల్సింది..నిజాలు.. అబద్దాలు కాదు.. జ్ఞాపకాలు.. ఇవి నీ వల్ల..నాకు చాలానే ఉన్నాయి..
ఆడపిల్లను కనీళ్లు పెట్టుకొని సాగనంపడం కాదు..కనీళ్లతో వచ్చిన.. తుడవాలి
బాగుండటం అంటే నవ్వుతూ ఉండటం..నలుగురితో ఉండటం..
పాలిచ్చి పెంచినవాళ్లకు.. పాలించడం ఓ లెక్క..
ఇలా.. అలవోకగా పదాలను.. రాసేస్తారు.. అక్కడ స్పేస్ లేకపోయిన చెప్పలనుకున్నది చెప్పేస్తారు..
అందుకే ఆయన మాటలు వింటూ.. జేబులో చేతులు పెట్టుకొని.. నడుచుకుంటూ వెళ్లిపొవచ్చు..
..

ప్రతి 30 సంవ్సరాలకు బ్రతుకు తాలుకూ ఆలోచన మారుతుంది..
సినిమావాళ్లు దాని ట్రెండ్ అంటారు..వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు..
రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.
ప్రతీ జనరేషన్ లోనూ కొత్త థాట్ ను తీసుకెళ్లేవాడు ఒక్కడే వస్తాడు.. వాడినే టార్చ్ బేరర్ అంటారు..
Happy birthday గురూజీ..

-praveen muddam

(Visited 42 times, 1 visits today)